Home Page SliderPoliticsTelanganatelangana,

‘బీజేపీ, కాంగ్రెస్‌ల టార్గెట్ కేటీఆర్’..కవిత

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేటీఆర్‌ను టార్గెట్ చేశాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ వెనకుండి నడిపిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసాకే, ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నమోదు చేశారు. రాజ్ భవన్ నుండి కథను నడిపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ప్రాంతీయపార్టీ అయిన బీఆర్‌ఎస్ పార్టీ ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయని ధ్వజమెత్తారు.