Home Page SliderNational

తమిళనాడు డీఐజీ ఆత్మహత్య

తమిళనాడులోని కోయంబత్తూర్ సర్కిల్‌లో డీఐజీగా పని చేస్తున్న సి. విజయ కుమార్ ఈ ఉదయం  (శుక్రవారం) 6 గంటల సమయంలో తన సర్వీస్ రివాల్వర్‌తోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రెడ్‌ఫీల్డ్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఆయన డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. ఈయన 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. గతంలో కాంచీపురం ఎస్పీగా, కడలూర్, నాగపత్తినమ్,తివరూర్ డిసీపీగా కూడా పనిచేశారు. ఆత్మహత్యకు తీవ్రమైన పని ఒత్తిడే కారణమని భావిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.