పాకిస్తాన్ పై డబుల్ సెంచురీ చేసిన టి20 క్రికెటర్
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌పై టి20 ప్లేయర్ ర్యాన్ రికల్టన్ అనూహ్యంగా డబుల్ సెంచురీ సాధించాడు.కెరీర్ మొత్తం మీద కేవలం 10 టెస్ట్ మ్యాచ్‌లు,6 వన్డేలు, 13 టి20Iలు మాత్రమే ఆడిన రికల్టన్ పాకిస్తాన్ పై డబుల్ సెంచురీతో విరుచుపడ్డాడు.టెస్ట్ ర్యాంకింగ్‌లో ఆస్ట్రేలియా,ఇండియా తర్వాత 3వ స్థానంలో కొనసాగుతున్న సఫారీలు…ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2023-25 షిప్ రేసులో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.పాకిస్తాన్ తో ఉత్కఠభరితంగా జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంతో ఉన్న దక్షిణాఫ్రికా…ఈ రెండో మ్యాచ్ ని డ్రాగా ముగిస్తే ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌కి వచ్చేస్తుంది.దీంతో రికల్టన్ మెరుపు ఇన్నింగ్స్ సఫారీలకు ఏ ఫలితాన్నిస్తాయో వేచి చూడాల్సిందే.