National

గోవును జాతీయజంతువుగా చేయాలన్న పిటిషనర్లకు సుప్రీం చీవాట్లు

జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్జీవో గోవాన్ష్ సేవా సదన్, ఇతరులు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంలో పబ్లిక్ ఇంట్రెస్టు పిల్‌ను దాఖలు చేశారు. క్రూరజంతువైన రాయల్ బెంగాల్ టైగర్ స్థానంలో హిందువులచే గోమాతగా పూజింపబడే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనేది వారి విన్నపం. అయితే దీనిపై జస్టిస్ ఎస్‌కే కౌల్, అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం..పిటిషనర్‌పై మండిపడింది. “ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోర్టు పని కాదని” తేల్చి చెప్పింది. ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారు?..అసలు ఈ విషయంలో ఎలాంటి ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది? మీరు కోర్టుకు వచ్చింనందుకు మేము చట్టాన్ని గాలికి వదిలేయాలా? అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిని మందలించింది బెంచ్. పిటిషన్ దాఖలు చేసినందుకు ఖర్చులు విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనితో సదరు న్యాయవాది అభ్యర్థన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.