టూ-ఫింగర్ టెస్ట్‌పై సుప్రీం నిషేధం
అత్యాచారం, లైంగిక దాడుల కేసుల్లో అమానవీయంగా ‘టూ- ఫింగర్ టెస్ట్’ ఉపయోగించడాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది. ఇలాంటి ఆచారం కొనసాగడం శోచనీయమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. `అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో రెండు వేలి పరీక్షను ఉపయోగించడాన్ని కోర్టు ఖండించింది. పరీక్ష అని పిలువబడే దానికి శాస్త్రీయ ఆధారం లేదని తేల్చింది. ఈ పరీక్ష మహిళలను మళ్లీ గాయపరుస్తుందన్న కోర్టు.. రెండు వేలి పరీక్షను నిర్వహించకూడదని హెచ్చరించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలను, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు చేసేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

