Home Page SliderNational

బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని హతమార్చిన 11 మంది దోషులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దోషుల ఉపశమనాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో చేసిన అభ్యర్థనను న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మహారాష్ట్రలో విచారణ జరిగినందున రిమిషన్ ఆర్డర్‌ను ఆమోదించడానికి గుజరాత్ ప్రభుత్వ ఆలోచన సరికాదంది. గుజరాత్ ప్రభుత్వం 2022 నాటి ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. నిందుతుల విడుదల మినహాయింపు ఉత్తర్వును సమర్థించలేమంది. నేరస్థులను విచారించిన రాష్ట్రం మాత్రమే విడుదల చేయగలదని కోర్టు పేర్కొంది.


పర్యవసానాల అలజడులను పట్టించుకోకుండా చట్టబద్ధమైన పాలనను కాపాడుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితురాలి హక్కులు ముఖ్యమని, మహిళలకు గౌరవం దక్కుతుందని కోర్టు పేర్కొంది. ఒక మహిళ సమాజంలో ఎంత ఉన్నతమైనవారైనా, తక్కువవారైనా గౌరవం పొందాలి. లేదా ఆమె అనుసరించే విశ్వాసం లేదా ఆమె ఏ మతానికి చెందినవారైనా గౌరవం పొందాలని పేర్కొంది. మహిళలపై జరిగిన క్రూరమైన నేరాలు ఉపశమనాన్ని అనుమతించవచ్చా అంటూ జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు.
2022 మేలో జస్టిస్ అజయ్ రస్తోగి (రిటైర్డ్) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దోషులు గుజరాత్ ప్రభుత్వం ముందు తమ ముందస్తు ఉపశమనం కోసం అప్పీల్ చేసుకోవడానికి అనుమతించడాన్ని ఆక్షేపించింది.

మే 2022 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు మోసపూరిత మార్గాల ద్వారా, వాస్తవాలను సస్పెండ్ చేయడం ద్వారా పొందబడిందని బెంచ్ పేర్కొంది. “ప్రాథమిక వాస్తవాలను అణచివేయడం, తప్పుదారి పట్టించే వాస్తవాలు చేయడం ద్వారా, గుజరాత్ రాష్ట్రానికి ఒక దోషి క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. కోర్టు నుండి గుజరాత్ ప్రభుత్వానికి రిమిషన్ను పరిగణించమని ఎటువంటి ఆదేశాలు లేవు. ఇది మోసపూరిత చర్య” అని ధర్మాసనం పేర్కొంది.