Home Page SliderTelangana

ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ.. కాంగ్రెస్ ను ఖతం చేస్తుండు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటు, రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్‌గిరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడని ఆరోపించారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని తీన్మార్ మల్లన్న సూచించారు.