Home Page SliderNational

బొగ్గు గనిలో అకస్మిక వరద..ముగ్గురు మృతి

అస్సాంలోని బొగ్గుగనిని ఆకస్మికంగా వరద ముంచెత్తింది. ఈ గనిలో 9 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు కార్మికలు మృతి చెందారు. గనిలోని వారిని రక్షించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ గని దిమా హసావ్ జిల్లాలో ఉంది. గనిలో నుండి నీరు వెలికి రావడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి గని నుండి వరద వచ్చిందని, లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. హెలికాఫ్టర్లు, ఇంజినీర్లు సహాయంతో చర్యలు చేపట్టారు. జాతీయ, విపత్తు సహాయక బృందాలు, ఆర్మీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.