Andhra PradeshHome Page Slider

చంద్రబాబు ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణకు సుప్రీం కోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్

తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ ఆరోపణలపై విచారణ జరపాలని లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇక ఏపీలో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల రచ్చతో మొత్తం వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్, మొత్తం వ్యవహారంపై ప్రధానికి లేఖ రాయడంతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో.. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రసాదంలో జంతువుల మాంసం, ఇతర కుళ్లిపోయిన వస్తువులతో కల్తీ చేశారని, దాదాపు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన నిరాధారమైన ఆరోపణపై విచారణకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ, సీనియర్ లాయర్ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.