కరోనా భయంతో మూడేళ్లుగా ఇంట్లోనే… ఒక తల్లి పిచ్చి ప్రేమ
మున్మున్ మాఝీ, 33, తన కొడుకుతో కలిసి గురుగావ్ ఇంటికి మూడేళ్లుగా తాళం వేసింది. తన పదేళ్ల బిడ్డ ఇంట్లోంచి బయటకు వస్తే… కరోనాతో చనిపోతాడని.. భయపడి ఇంట్లోనే ఉండిపోయింది. తల్లి, కొడుకును బయటకు తీసుకొచ్చిన పోలీసులు అసలు విషయం చెప్పారు. కోవిడ్ తర్వాత కొందరు ఎలా మారిపోయారన్నదానికి గురుగావ్‌లో జరిగిన ఉదంతం నిలువెత్తు నిదర్శనం. ఒక వారం క్రితం మహిళ భర్త సుజన్ మాఝీ పోలీసులను ఆశ్రయించడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. మాఝీ, ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్, తన భార్య… తనను, కొడుకును మూడేళ్లుగా ఇంటికి తాళం వేసి ఉంచిందని పోలీసులకు చెప్పాడు. లాక్‌డౌన్ ఆంక్షలు ముగిసిన తర్వాత తాను ఉద్యోగానికి వెళ్లగా… తనను తిరిగి ఇంట్లోకి అనుమతించలేదన్నాడు. భార్యకు, బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా తాను నిత్యవసర వస్తువులను చేరవేస్తూ… ఇంటి అద్దెను క్రమం తప్పకుండా కట్టానన్నాడు. తాను కొంత కాలం స్నేహితులు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నానన్నాడు మాజీ భర్త సుజన్. ఎంత చెప్పిన తన భార్య మాట వినకపోవడంతో గత్యంతరం లేక మరో ఇంటిని రెంట్‌కు తీసుకున్నానన్నాడు.

మొత్తం వ్యవహారాన్ని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగగా… తాము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పింది. ఐతే పిల్లవాడిని చూసిన వెంటనే జుట్టు భూజాల వరకు పెరిగిందని అధికారులు చెప్పారు. కరోనా సమయంలో చిన్నారికి ఏడేళ్లు. ఇప్పుడు పదేళ్లు. మూడేళ్లుగా తాను ఎవరినీ చూడలేదని బాలుడు గోడలపై రాశాడు. మున్మున్ మాఝీ కోవిడ్‌పై భయాందోళనలో ఉందని, ఆమెకు బయటికి వచ్చే ఉద్దేశ్యం లేదని… కొడుకు చనిపోతాడని… బయటకు రాలేదని దీమాగా అధికారులకు చెప్పింది. బాధితురాలు నమ్మేలా మాట్లాడించి… పోలీస్ స్టేషన్‌కు పిలిచామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఇంటికెళ్లి పిల్లవాడిని రక్షించి ఆస్పత్రికి తరలించామన్నారు. పోలీసులు, శిశు సంక్షేమ బృందాలు ఫ్లాట్‌లోకి ప్రవేశించడంతో.. ఇళ్లంతా దుర్ఘంద భరితంగా కన్పించింది. మూడేళ్లుగా చెత్త వేయకపోవడంతో అపార్ట్‌మెంట్ అపరిశుభ్రంగా మారింది. బట్టలు, వెంట్రుకలు, ఖాళీ కిరాణా ప్యాకెట్లు నేలపై ఉన్నాయి. వస్తువులన్నీ మురికి మురిగ్గా కన్పించాయి.

