త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
అతి త్వరలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మాటలను బట్టి వెల్లడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల క్రితం బ్యారెల్ చమురు ధర 80 డాలర్లు ఉండగా, ఇప్పుడు 70 డాలర్లు వద్ద కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్రం సూచనలు ఇస్తోంది. ఈ ధరలు 2021 నాటి ధరలకు సమానంగా ఉన్నాయి. రష్యా నుండి కూడా వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాస్త ధరలు తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు జమ్ముకాశ్మీర్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికల కోసం కూడా చమురు ఉత్పత్తి పెంచాలని ఇతర దేశాలను కోరుతోంది. 90 శాతానికి పైన చమురు సంస్థలు ప్రభుత్వ రంగంలోనే ఉండడం వల్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

