Andhra PradeshHome Page Slider

స్కిల్ కేసు కొట్టివేసే అవకాశాలే ఎక్కువ: జడ శ్రావణ్‌కుమార్

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశముందని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వొకేట్ జడ శ్రావణ్‌కుమార్ అన్నారు. కేసు విచారణలో అడ్వకేట్స్ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ల వద్ద సరైన సమాధానం లేదని చెప్పారు. చంద్రబాబును జైల్లోనే ఉంచాలనే విధంగా ప్రభుత్వ ఆలోచనే తప్ప,  కేసుకు సంబంధించి ఆధారాలను సేకరించే ఆలోచనే లేదు.