Home Page SliderTelangana

జనసేనకు ఆరు సీట్లు? బీజేపీతో కుదిరిన డీల్

తెలంగాణలో జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐతే 6 సీట్లకు మాత్రమే ఏకాభిప్రాయం కుదరినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేనకు తొలుత పెద్ద ఎత్తున సీట్లిస్తారన్న ప్రచారంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నియోజకవర్గం శేరిలింగంపల్లి జనసేన అడుగుతోందన్న వార్తలో ఆ పార్టీ నేతలు ఒక్కసారికి అలర్ట్ అయ్యారు అయితే శేరిలింగంపల్లి జనసేనకు ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంలో బీజేపీ ఆలోచనలేంటన్నదానిపై క్లారిటీ రావడం లేదు. ఐతే తాజాగా జనసేనకు ఖమ్మం జిల్లాలో మూడు సీట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కూకట్ పల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వైరా, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ సీట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. మాల్కాజ్‌గిరి, తాండూరు టికెట్ల కోసం జనసేన పట్టుబడుతోంది అయితే ఆ అవకాశం లేనట్టుగా బీజేపీ నేతలు, జనసేనకు క్లారిటీ ఇచ్చారు.