దమ్ముంటే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలి-మంత్రి కాకాని
రైతుల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం
కరవు పరిస్థితులకు మారుపేరు చంద్రబాబు
రైతుల సంక్షేమం, భద్రత కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.27,062 కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసిందని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా, . మాండౌస్ తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీతో కలిపి రూ.1912 కోట్లను ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించి సీఎం జగన్ ఇంత మంచి చేసినా ఎల్లో మీడియా మాత్రం విషం చిమ్ముతోందని ఆయన మండిపడ్డారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మంగళవారం బటన్ నొక్కి రైతులకు ఆర్థిక సాయాన్ని విడుదల చేయడం జరిగిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా రైతులందరికీ రూ.13,500 లబ్ది చేకూరుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నిధులను అందిస్తుందని చెప్పారు. 2019 నుంచి ఇప్పటి వరకు రూ.27 వేల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని రైతు భరోసా కింద అందించామన్నారు. మాండౌస్ తుపాను వల్ల దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీతో కలిపి రూ.1912 కోట్లను ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించి సీఎం జగన్ ఇంత మంచి చేసినా ఈనాడు పత్రిక మాత్రం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్న మాట వాస్తవం కాదా అని విమర్శించారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరవు మండలాలు ప్రకటించారని.. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కరవు మండలం అయినా ప్రకటించారా అని ప్రశ్రించారు. రైతులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి పట్టదని.. అందుకే ఎప్పుడూ విమర్శలు చేస్తారని మంత్రి మండిపడ్డారు.

చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడని.. మరి ఆ హామీ నెరవేర్చారా లేదా అనేది ఈనాడు ప్రచురించాలని సవాలు విసిరారు. 2019 ఎన్నికలకు ముందు మేం నాలుగు విడతల్లో రూ.12 వేల రైతులకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించామని.. అధికారంలో వచ్చాక నాలుగు కాదు, ఐదు విడతలుగా రూ.13,500 రైతులకు ఆర్థిక సాయం చేశామని.. మొత్తం ఐదు విడతలలో దాదాపు రూ.60 వేల రైతులకు లబ్ది చేకూర్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో కరవు ఉండేది. ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సాగు నీటి వసతులు కల్పించామని.. దీంతో పంట దిగుబడులు పెరిగాయన్నారు దీన్ని కూడా విమర్శించడం ఏంటని మంత్రి తప్పు బట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు 80శాతం పూర్తి చేశాం అని టీడీపీ నాయకులు సమర్థించుకుంటున్నారు… మరి మిగతా 20శాతం పూర్తి చేయడానికి మీకు ఏం అయిందని ప్రశ్నించారు.

ఈ రోజు వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగుతుందని… టీడీపీకి అలా ఒంటరిగా బరిలో దిగే దమ్ముందా అని సీఎం జగన్ మీకు సవాలు విసిరారు. దానికి మీ దగ్గర సమాధానం ఉందా అని మంత్రి ప్రశ్నించారు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగే దమ్ముందా చెప్పాలని కోరారు.. చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు ఏమైనా ఉంటే చెప్పాలని కోరారు. అమ్మఒడి, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం వంటి ఎన్ని అద్భుతమైన పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆయన కుమారుడు లోకేశ్ తో పాదయాత్ర చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ధైర్యముంటే ఒంటరిగా పోటీ చేయడంపై సీఎం జగన్ విసిరిన సవాలుకు స్పందించాలని మంత్రి కాకాని డిమాండు చేశారు.

