Home Page SliderNational

కర్ణాటకలో మంత్రి శ్రీరాములుకు షాక్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాలపై  దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కర్ణాటకలో తొలి దశ కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కర్ణాటకలో మంచి పట్టున్న బీజేపీ అభ్యర్థి మంత్రి శ్రీరాములుకు గట్టి షాక్ తగిలింది. కాగా ఆయన పోటి చేస్తున్న నియోజక వర్గం బళ్లారిలో ఎవరు ఊహించని విధంగా ఆయన  830 వందల ఓట్ల  తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే బళ్లారి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర తొలిరౌండ్‌లో 5,862 ఓట్లతో ముందంజలో ఉండగా..5,032 ఓట్లతో శ్రీరాములు వెనుకబడ్డారు. దీంతో కర్ణాటకలోని బీజేపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు.