ఇంగ్లాండ్ వీరకొట్టుడుపై షోయబ్ అక్తర్ కామెంట్
పాకిస్తాన్,ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రికార్డులను తిరగరాసింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రికార్డులను సైతం చెరిపేసింది. తొలిరోజు టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఘనతను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్లో ఇంగ్లాండ్ టీం పర్యటించింది. రావల్పిండి టెస్టులో పైచేయి సాధించింది. తొలుత ఇంగ్లాండ్ జట్టు సభ్యులు వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. టెస్ట్ ఆరంభానికి ముందు కోలుకుని.. ప్రాక్టీస్ లేకుండానే నేరుగా క్రీజులో దిగారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఇంగ్లాండ్ టీం అస్వస్థతకు గురైనప్పుడే ఇలా ఆడితే.. వారు బాగుంటే పరిస్థితి ఏమయ్యేదో అంటూ ట్వీట్ చేశాడు. అయితే.. ఇందులో పాకిస్తాన్ టీం ప్లేయర్ల తప్పుపట్టడానికి ఏమీలేదన్నాడు. ఎందుకంటే వారు టీ20 ఫాస్ట్ బౌలర్లు. టెస్ట్‌ల్లో వారింకా కుదురుకోవలసి ఉందంటూ షోయబ్ తెలిపాడు.

