శ్రీరెడ్డిపై షర్మిల కీలక వ్యాఖ్యలు
తాను తప్పు చేశానని, క్షమించెయ్యమంటూ మంత్రి లోకేష్‌కు నటి శ్రీరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులలో అసభ్యంగా మాట్లాడానని, వీడియోలలో అనుచిత వ్యాఖ్యలు చేశానని క్షమించాలని అరెస్టులు చేయొద్దంటూ శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు. కానీ ఇలాంటి వారిని క్షమించకూడదంటూ పరోక్షంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. సోషల్ మీడియాలో తప్పుడు మాటలు మాట్లాడి, వీడియోలు తీసిన వారిని శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనితలపై అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారని శ్రీరెడ్డిపై మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా వారు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోపక్క రాజమండ్రిలో కూడా ఆమెపై కేసు నమోదయ్యింది.