నవరాత్రి మెట్రో రైలు చూద్దామా?
కోల్‌కతాలో దేవీ నవరాత్రులు చూడడానికి రెండుకళ్లూ చాలవు. అద్భుతంగా అక్కడి మండపాలు తీర్చిదిద్దడమే దానికి కారణం. రకరకాల థీమ్స్‌తో అక్కడ మండపాలు చూడడానికి భక్తులు బారులు కడతారు. తాజాగా అక్కడ మెట్రో రైల్ థీమ్‌తో రూపొందించిన దుర్గా మండపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు క్యాప్షన్‌గా మెట్రో మార్గంలో దుర్గామాత అని పెట్టారు.