Home Page SliderTelangana

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు

పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా ఎమ్మెల్యేల అనర్హతపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే కేసును సుమోటోగా తీసుకుంటామంది. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.