తెలంగాణా ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎంపీ కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కాగా మరో 45 రోజుల్లో తెలంగాణాలో అసెంబ్లీ రద్దవుతుందని తెలిపారు. అయితే ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయన్నారు . తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్నికల సమయంలో అందరు కలిసి పనిచేయాలని ఎంపీ సూచించారు. అయితే నియోజక వర్గాల్లో ఇద్దరు పెద్ద నాయకులు ఉంటే .. ఒకరికి MLA టికెట్, మరొకరికి MLC లేదా ZP ఛైర్మన్ పదవి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

