మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
మా కూటమిలోనే బీజేపీ ఉన్నప్పటికీ బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత కూటమిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే ఉన్నందున ఆలోగా మరిన్ని పార్టీలు మా కూటమిలోకి వస్తాయని మాజీ సీఎం ఈపీఎస్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. 2026లో అసెంబీ ఎన్నికలను పురస్కరించుకుని అన్నాడీఎంకే ఆధ్వర్యంలో మక్కలై ‘కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈపీఎస్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా శివగంగ జిల్లాలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. విమానంలో తిరుచ్చి చేరుకున్న ఈపీఎస్ కు విమానాశ్రయంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. 1976లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారని, ఆ తర్వాత పలుమార్లు కేంద్రంలో అధికారంలో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించిన డీఎంకే తనకున్న అధికారంతో విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చకుండా విద్యార్థులకు మొండిచెయ్యి చూపించిందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ప్రస్తుతం అన్నాడీఎంకే ఉందని, అయితే బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయని, మరో 8 నెలల్లో కూటమిలో చేరిన పార్టీల వివరాలను స్పష్టంగా వెల్లడిస్తామని ఈపీఎస్ తెలిపారు