Home Page SliderTelangana

ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేత నిరసన

ఈడీ ఆఫీస్ ఎదుట రేపు దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు బుధవారం ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈడీని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అగ్రనేతలపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, అమిత్ షా, ఈడీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డ్ పట్టుకుని వీహెచ్ నిరసన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ర్టంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అందుబాటులో లేనందున తెలంగాణలో రేపు నిరసనలు చేయాలని పార్టీ నిర్ణయించింది. అయితే.. పీసీసీ చీఫ్ లేకపోయినా కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నా చేస్తానని సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు భైఠాయించి వీహెచ్ నిరసన తెలిపారు.