Home Page SliderTelangana

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు

సికింద్రాబాద్ కంటోన్మెట్ బీజేపీ అభ్యర్థిని పార్టీ ఖరారు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశా తిలక్‌ను భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం నామినేట్ చేసింది. నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఫిబ్రవరిలో కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న పెద్ద కూతురు లాస్య నందిత హఠాన్మరణం చెందడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. సాయన్న పెద్ద కూతురు నివేదితను బీఆర్‌ఎస్ ఖరారు చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయణన్ శ్రీ గణేష్ పేరును ప్రతిపాదించింది. గత ఎన్నికల్లో శ్రీ గణేష్ గణనీయమైన ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలతో కలిసి ఉపఎన్నిక జరగబోతుండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది.