Andhra PradeshHome Page Slider

30 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా..

తిరుపతి జిల్లా తడా మండలం బోడి లింగాలపాడు సమీపంలో నారాయణ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కొంతమంది పిల్లలు గాయపడ్డారు. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అటుగా వెళ్తున్న వారు, స్థానికులు స్కూల్ బస్సు నుండి పిల్లలను రక్షించి అధికారులకు సమాచారం అందించారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.