కాసేపట్లో తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కమిషన్ ప్రకటించనుంది. మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ 17తో ముగుస్తుంది. ఈశాన్య రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

