హర్యానాలో సీన్ రివర్స్, బీజేపీ సంబరాలు, ఆందోళనలో కాంగ్రెస్
హర్యానాలో సీన్ చేంజ్ అవుతోంది. ఒక్కసారిగా కాంగ్రెస్ అదృష్టం దురదృష్టంగా మారినట్టుగా ఫలితాలు వెల్లడవుతున్నాయ్. సర్వే సంస్థల అంచనాలన్నీ కూడా తలకిందులయ్యేలా తీర్పు రాబోతున్నట్టుగా కన్పిస్తోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో కన్పించినా, ఇప్పుడు బీజేపీ దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం ఏడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 55 సీట్లు గెలుచుకుంటుందని, సగం మార్కు 45 కంటే 10 ఎక్కువ సాధిస్తుందని చెప్పగా, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసాయి. కౌంటింగ్ ప్రారంభం కాకముందే న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల సంబరాలు ప్రారంభం కాగా ప్రస్తుతం అక్కడ నిస్తేజం కన్పిస్తోంది. ఇక బీజేపీ నేతలు సంబరాలు జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

