NewsTelangana

బండిని ముందుకు కదలనివ్వడం లేదు…!

బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు తెలంగాణ పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర చేసేందుకు సిద్ధమైన సంజయ్‌ను బయటకు రానివ్వడం లేదు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేయాలని భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఇవాళ పాదయాత్ర చేయాలని సంజయ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆదివారం రాత్రి భైంసా వెళ్లకుండా పోలీసులు సంజయ్‌ను వెంకటాపూర్ శివారులో అడ్డుకున్నారు. పోలీసుల తీరుతో బీజేపీ నేతలు పాదయాత్ర అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి అనుమతి లభిస్తే పాదయాత్రను యథావిథిగా నిర్వహించాలని బండి యోచిస్తున్నారు.

అయితే అనుమతి లేకుండా బయటకు వస్తే అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారు. ముందుగానే పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్న సంజయ్.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నారు.