వైరల్ అవుతోన్న సమంత ఇన్‌స్టా స్టోరీ
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలకు ఓ ఏడాదిపాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆమె గతకొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స నిమిత్తం సినిమాల నుండి బ్రేక్ తీసుకొని విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల తాను ఇండోనేషియా బాలిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సమంత మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్ చేశారు. కాగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ స్టోరీలో సమంత తాను 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో 6 నిమిషాలపాటు ఐస్ బాత్ చేసినట్టు తెలిపారు. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ ఇది మయోసైటిస్ చికిత్సలో భాగమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా సమంత ఇలాంటి ఐస్ బాత్ థెరపీ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ఇది టార్చర్ సమయం అని పేర్కొన్నారు.