Home Page SliderInternational

నేను క్షేమంగానే ఉన్నా

ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్నాయి. ఆమె బరువు తగ్గారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, స్పేస్ సెంటర్ కి వచ్చేటప్పుడు ఎంత బరువు ఉన్నానో.. ఇప్పుడూ అంతే బరువు ఉన్నానని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ ఉండాలంటే కొన్ని రకాల వ్యాయమాలు చేయాల్సి ఉంటుందని అందువల్లే తాను చిక్కిపోయినట్టు కనిపిస్తున్నానని చెప్పారు. అంతేకానీ తాను బరువేమి తగ్గలేదని వెల్లడించారు.