NationalNews

దేశం కంటే గొప్ప ఏదీ కాదు-మోహన్ భగవత్

తెలంగాణలో ఏబీవీపీ ప్రాంత కార్యాలయం అద్భుతంగా నిర్మించారని కితాబిచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. కార్యకర్తల స్వప్నం, నిష్టతో మాత్రమే భవన నిర్మాణం సాధ్యమయ్యిందన్నారు భగవత్. తెలంగాణ ఏబీవీపీ కార్యకర్తల కష్టానికి ఈ భవనం ప్రతీకన్నారు. ఒకప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే సరస్వతిని పూజిస్తారని భావించేవారని… కానీ ఇప్పుడు ఆ కార్యకర్తకు దేశమే అన్నింటికంటే ముఖ్యమన్న భావన కలుగుతోందన్నారు. రాజుల కాలం, అంతకంటే ముందు నుంచి ఎంతో మంది వచ్చారు పోయారని కొందరు మాత్రమే నేటికీ గుర్తుంటారన్నారు. కానీ రాముడు 8 వేల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నారన్నారు. రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ మన కార్యకర్తలో ఉందన్నారు మోహన్ భగవత్.