మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు మరో ఘనత దక్కింది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ విన్నర్‌గా నిలిచింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా మరో 4 అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక రాజమౌళీ ఉత్తమ డైరెక్టర్ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా అవార్డుల్లో సత్తా చాటుతున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయి అభిమానుల హృదయాలను గెలుచుకుంది.