Andhra PradeshHome Page Slider

విశాఖలో రౌడీ షీటర్ ఆత్మహత్య

విశాఖపట్నంలోని సిద్దేశ్వరంలో రౌడీషీటర్ గాలిశ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగులు వేయడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బెట్టింగుల వల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేకపోయినట్లు గుర్తించారు. ఈయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈయనపై అనేక చోరీలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు తెలియజేశారు. రిపోర్టును బట్టి కేసు దర్యాప్తు చేసి, వివరాలను అందిస్తారు.