టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా టెస్ట్ మ్యాచ్‌లలో వైఫల్యం చెందుతున్నారు. ఇటీవల గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ వేసిన బంతికి వికెట్ పోగొట్టుకున్నాడు. దీనితో నిరాశపడిన రోహిత్ తన గ్లౌజ్‌లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. అయితే ఈ సంఘటనతో రోహిత్ ఇకపై టెస్ట్ మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం మొదలయ్యింది. గత రెండేళ్లలో మొత్తం 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్ ఆడి కేవలం 621 పరుగులు మాత్రమే సాధించారు. ఒక్క సెంచరీ మాత్రమే నమోదు చేశారు. ఈ సంవత్సరంలోనే టీ 20 ప్రపంచకప్ గెలిచాక రోహిత్ టీ20కి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో కూడా ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కూడా అనుకున్నంతగా జరగలేదు. దీనితో డబ్ల్యూటీసీ ఫైనల్స్ 2025కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో కూడా టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు.