కేపీహెచ్బీలో రోడ్డు ప్రమాదం
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మహనగరంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి భయంకరమైన రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. అంతేకాకుండా ఈ ఊహించని ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కూకట్పల్లిలో తాజాగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని మెట్రో పిల్లర్ నెం.746 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ముందుగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో మృత్యువాతపడ్డ వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.