Andhra PradeshHome Page Slider

గంజాయిని పట్టించినవారికి రివార్డ్ – హోంమంత్రి అనిత

ఏపీలో గంజాయిని కూకటివేళ్లతో పెకటించివేస్తామని హామీ ఇచ్చారు హోం మంత్రి అనిత.  గంజాయి పంపిణీపై సమాచారం ఇచ్చినవారికి రివార్డులు కూడా ఇస్తామన్నారు.  గంజాయి నియంత్రణకు యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఏపీలో గంజాయి దందా గత ప్రభుత్వ హయాంలో పాతుకుపోయిందని, దానిపై ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేస్తున్నాం. గిరిజనులను ప్రలోభపెట్టి గంజాయి సాగు చేయిస్తున్నారు. చిన్నపిలల్లతో సహా గంజాయికి అలవాటు పడుతున్నారు. అమాయక గిరిజనులు మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నారు. నిజంగా దీనివెనుక ఉన్న పెద్దమనుషులు దొరకడం లేదన్నారు.