రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఆదర్శం- వెంకయ్యనాయుడు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవోలను తెలుగులో ఇవ్వడం ద్వారా తెలుగురాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వ పాలన ఉండాలని, అందుకు ప్రజలకు అర్థమయిన భాషలో జీవోలు ఇవ్వడం అవసరమన్నారు. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవోలను తెలుగులో ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. పరిపాలనకు సంబంధించిన ఉత్తర్వులు, సమాచారం ఉండాలని ఎప్పటినుండో తాను చెప్తున్నానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శికి అభినందనలు. తెలుగు రాష్ట్రాలు ఇక నుండి ఉత్తర్వులన్నీ పూర్తిగా తెలుగులోనే అందించాలని తాను ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.