భద్రాద్రి కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం సీతారామ ప్రాజెక్టు పంప్2 వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.