Home Page SliderTelangana

మరోసారి ఢిల్లీకి రేవంత్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో వీరందరూ భేటీ కానున్నారు. డీలిమిటేషన్, రాష్ట్రంలో మం త్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించను న్నట్లు తెలుస్తోంది.