Home Page SliderTelangana

రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ శ్రీశైలం టెంపుల్‌కు పాదయాత్ర

ఖమ్మం: రాష్ట్రానికి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం వస్తానని ఆర్టీసీ డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన కోరిక నెరవేరడంతో గురువారం డిపో కార్యాలయం నుండి కాలినడకన మొక్కు చెల్లించేందుకు బయలుదేరారు. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడానికి వీలులేదని ప్రచారం జరిగిన సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నారు. సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు రేవంత్ మద్దతుగా నిలిచారని, అందుకే ఆయనంటే అభిమానమని తెలిపారు. శ్రీశైలం చేరుకునేందుకు 15 రోజులు టైమ్ పడుతుందని చెప్పారు.