Breaking NewsHome Page SliderInternational

రిట‌ర్న్ టు ఇండియా @ట్రంప్ ఎఫెక్ట్

అమెరికాలో అక్ర‌మంగా నివసిస్తున్న ఇండియ‌న్స్‌ని అమెరికా ప్ర‌భుత్వం ద‌శ‌ల వారీగా తిరిగి పంపించ‌నుంది.అమెరికాకి రెండో సారి అధ్య‌క్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక‌ల హామీల్లో భాగంగా యూఎస్ లో ఉంటున్న అక్ర‌మ వల‌స‌దారుల‌ను ఏరివేస్తాన‌ని చెప్పిన ప్ర‌కారమే అన్నీ దేశాల‌కు చెందిన వారిని గుర్తించి ఆయా దేశాల‌కు తిరిగి పంపించివేస్తున్నారు.ఇందులో భాగంగా తొలి విమానం గురువారం ఇండియాకి చేరుకుంది. ఇది పంజాబ్‌లోని అమృత్ స‌ర్‌లో దిగింది.ఈ విమానంలో ఇండియ‌న్స్‌తో పాటు భార‌త ఉప‌ఖండంలోని ప‌లు దేశాల‌కు చెందిన అక్ర‌మ వ‌ల‌స‌దారులు కూడా ఉన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 7.5 లక్షల మంది భారతీయులు ఇక ఇండియాకి రానున్నారు.తొలి దశలో 18 వేల మందిని భారత్‌కు తరలించనుండ‌గా …ఇందులో 200 మంది తో కూడిన అక్ర‌మ వ‌ల‌స‌దారుల విమానం ఇవాళ ఇండియా చేరుకుంది.