చంద్రబాబు IRR కేసులో తీర్పు రిజర్వ్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పుడప్పుడే ఊరట లభించేలా లేదు. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కాగా చంద్రబాబు, లోకేష్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సీఐడీ తరుపు లాయర్లు మెమో వేశారు.అయితే దీనిపై చంద్రబాబు తరుపున లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. ఈ మేరకు చంద్రబాబు తరుపున న్యాయవాదులు,సీఐడీ తరుపున న్యాయవాదులు దీనిపై నిన్న లిఖిత పూర్వక వాదనలు కోర్టులో సమర్పించారు. అయితే వాటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది.