ఆర్జీవీకి ఊరట
వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్‌వర్మకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను వచ్చే సోమవారం వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశించింది. వ్యూహం చిత్ర ప్రమోషన్లలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అజ్ఞాతంలో ఉన్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది.

