సంచలనం సృష్టిస్తున్న రేగాకాంతారావు ఫేస్ బుక్ పోస్ట్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి కొందరు వచ్చారంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం మలుపులు తిరుగుతోంది. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యత కలిగిన భారత పౌరుడిగా.. క్రమ శిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకు నాకు పార్టీ అప్పజెప్పిన పని విజయవంతంగా చేశా.. కార్యకర్తలు గర్వపడండంటూ ఆయన పోస్టు చేశారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో బయటకు వచ్చిన రేగా కాంతారావు నవ్వుతూ కన్పించడంతో మొత్తం వ్యవహారంలో ఎన్నో అనుమానాలకు కారణమయ్యింది. అదే సమయంలో రేగా కాంతారావు విక్టరీ సింబల్ చూపించడం.. తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
