రికార్డు సాధించిన ఫోన్ పే
ఫోన్ పే లేని మొబైల్ ఫోన్ లేదంటే అతిశయోక్తి లేదేమో. యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే సంచలన రికార్డులు సృష్టిస్తోంది. సెప్టెంబర్ ఒక్క నెలలోనే 48 శాతం మార్కెట్ షేర్ సాధించింది. దాదాపు 722 కోట్ల ట్రాన్సాక్షన్స్‌తో, రూ.10.30 లక్షల కోట్లు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్లు చేసింది. దీని తర్వాత స్థానంలో గూగుల్ పే 37.4 శాతం మార్కెట్ షేర్‌తో ఉంది. పేటీఎం కేవలం 7 శాతంతో, ఇతర యాప్స్ 7.6 శాతంతో ఉన్నాయి. ఈ వివరాలను ఎన్‌పీసీఐ వెల్లడించింది.