Home Page SliderNational

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

అక్టోబర్‌లో భారత్ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూళ్లయ్యాయి. సీజీఎస్టీ రూ.33వేల కోట్లు, ఎస్‌జీఎస్టీ రూపంలో రూ. 42 వేల కోట్లు నమోదయ్యాయి. ఐజీఎస్టీ రూపంలో మరో రూ.లక్ష కోట్ల వరకూ వసూలయ్యాయి. దీనితో ఈ ఒక్క నెలలోనే రూ.1.87 లక్షల కోట్లు వసూలయినట్లయ్యింది. గత సంవత్సరంలో పోలిస్తే 9 శాతం మేర పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మరోపక్క దిగుమతులపై పన్నులు 4 శాతం పెరిగాయి. మొత్తంగా రూ.45వేల కోట్లు వసూలయ్యింది. ఆదాయపు పన్ను రిఫండ్లు రూ.19 వేల కోట్ల మేరకు జారీ చేశామని తెలిపారు.