Home Page SliderNational

రాజీనామా చేయడానికైనా సిద్ధం..

ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకైనా తాను సిద్ధమని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా హత్యాచార ఘటనలో మృతి చెందిన ట్రైనీ డాక్టర్ కి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారు. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం రెండు గంటల పాటు ఎదురుచూశానని సీఎం వెల్లడించారు. డాక్టర్లతో చర్చలకు ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించానని తెలిపారు. హత్యాచార కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉందని మమతా పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లతో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని స్పష్టం చేశారు. భేటీపై వీడియో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు. సుప్రీం కోర్టు పర్మిషన్ తో ఫుటేజిని డాక్టర్లకు అందజేస్తామని తెలిపారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోబోమని సీఎం మమత వెల్లడించారు.