ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయిన రతన్ టాటా అంత్యక్రియలు
పారిశ్రామికవేత్త, దాతృత్వ ధీరుడు రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లీ స్మశానవాటికలో పూర్తయ్యాయి. రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ఎందరో రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు ముంబై చేరుకున్నారు. రతన్ టాటాతో తమకున్న అనుబంధాన్ని వారు వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, రతన్ టాటాకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటుగా పలువురు మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యులు, సినీతారలు రతన్ టాటాకు తుది వీడ్కోలు పలికారు.


