National

రతన్ టాటా ఆరోగ్య విషయంలో వదంతులు

సోమవారం రతన్ టాటా రక్తపోటు భారీగా తగ్గడంతో ఈ తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రతన్ టాటా ఆరోగ్యం ఏమవుతోందన్న బెంగ నెలకొంది. “నా ఆరోగ్యం గురించి ఇటీవలి పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఈ వాదనలు నిరాధారమైనవని ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలనుకుంటున్నాను” అని రతన్ టాటా చెప్పారు. 86 ఏళ్ల టాటా సన్స్ మాజీ ఛైర్మన్ మాట్లాడుతూ, “నా వయస్సు, సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను మంచి ఉత్సాహంతో ఉన్నాను. ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోండి”. అని చెప్పారు.