Home Page SliderInternational

‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో ముఖ్య అతిథిగా రామ్‌చరణ్

చిరు కుమారుడు రామ్‌చరణ్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామ్‌చరణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అమెరికా వెళ్లిన చరణ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ అనే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. ఇలాంటి అరుదైన గౌరవం లభించిన మొదటి తెలుగు సినిమా నటుడు ఈయనే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కు వెళ్లారు రామ్‌చరణ్. ఈ నేపథ్యంలో RRR సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

 ఈ చిత్రం స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే రాజమౌళి తెరకెక్కించిన అపురూప చిత్రమని పేర్కొన్నాడు. ఈ చిత్రం స్నేహం, సోదరభావాల నేపథ్యంలో తెరకెక్కిందని చెప్పారు. ఈ చిత్రంలో ‘నాటు నాటు’ పాటకు వస్తున్న గుర్తింపును భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అనుకుంటున్నానన్నారు. రాజమౌళి త్వరలో గ్లోబల్ సినిమాలో అడుగుపెడతారేమో అన్నారు. తాము తదుపరి ప్రాజెక్ట్‌లోకి వెళ్లబోతున్న సమయంలో తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్ పాల్గొనడంపై ఆయన సతీమణి ఉపాసన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అపోలో ఆస్పత్రుల జాయింట్ MD, ఉపాసనకు పిన్ని అయిన సంగీతారెడ్డి కూడా తమ అల్లుడు సాధించిన విజయాలకు ఎంతో గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.