Home Page SliderNational

రజినీకాంత్ కు తీవ్ర అస్వస్థత

సూపర్ సార్ రజినీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పితో నిన్న రాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అలాగే ఇవాళ ఆయనకు గుండెకు సంబంధించిన టెస్టులు చేసిన డాక్టర్లు, పొత్తి కడుపులో స్టంట్ వేసినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 76 ఏళ్ల వయస్సున్న రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో వెట్టైయన్ మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇక లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే.. పదేళ్ల క్రితం రజినీకాంత్ కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది.